Train Passengers | నేరేడ్మెట్, జూన్ 9 : ప్రయాణికులకు అనుకూలంగా రైళ్ల రాకపోకలు సాగించాలని సబర్బన్ ట్రైన్ అండ్ బస్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నూర్, భరద్వాజ్ సోమవారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు.
తుంగభద్ర ఎక్స్ ప్రెస్ను కాచిగూడ నుండి కాకుండా మేడ్చల్ నుండి ప్రారంభిస్తే బొల్లారం, మల్కాజిగిరి ప్రాంత వాసులకు ఉపయోగపడుతుందని, విశాఖ-మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ను అటు కర్నూల్ వరకు కానీ లేదా రాయచూరు మీదుగా మంత్రాలయం వరకు పొడిగిస్తే శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులకు సౌకర్యంగా ఉంటుందని, మల్కాజిగిరి స్టేషన్లో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను నిలపాలని కొరారు.
కృష్ణ ఎక్స్ప్రెస్ను ఆర్కే నగర్లో నిలపాలని, చర్లపల్లి నుండి పలు దిక్కుల ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేలా చూడాలని కోరారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ద్వారా రైల్వే బోర్డు అనుమతులు పొందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ డివిజన్ అభివృద్ధికి తోడ్పడిన భారత ప్రభుత్వ, రైల్వే మంత్రిత్వ శాఖ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు ఈ సందర్భంగా నగర ప్రయాణికుల తరుపున జెడ్ఆర్ యూసీసీ మెంబర్ నూర్ అభినందనలు తెలిపారు.
Gudem Mahipal Reddy | అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: పటాన్చెరు ఎమ్మెల్యే
Naresh | ఏడుపాయల వన దుర్గమ్మ సేవలో నరేష్..