బోడుప్పల్, జూలై 19: అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తాం అని రాధిక గుప్తా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాధిక గుప్తా అన్నారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను మున్సిపల్ కమిషనర్ శైలజతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రెండవ దశ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై దిశా నిర్దేశం చేశారు.
అనంతరం నగర పరిధిలోని 27, 28 డివిజన్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ..అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ అజయ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు, నేనే ప్రవీణ్ కుమార్, ఆర్ఐ వెంకటేశ్వర్లు, హౌసింగ్ ఏఈ అల్లాజీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.