Govt Schools | కీసర, జూన్ 11 : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని కీసర మండల విద్యాధికారి జమదగ్ని తెలిపారు. అందుకు తల్లిదండ్రులందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్‌కు సహకరించాలని జమదగ్ని కోరారు. కీసర మండలంలోని వన్నీగూడ, కీసర, కీసరదాయరలో బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యాధికారి జమదగ్ని మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా మౌళిక వసతి సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని, తరగతి గదులతోపాటు క్వాలిటీ ఉపాధ్యాయులున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పిస్తే భవిష్యత్‌లో మంచి ప్రయోజకులు అవుతారన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ముత్యం, స్వామి, గోపాల్, కీసర మాజీ సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేశ్, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
నాగారం మున్సిపాలిటీ పరిధిలో బడిబాట..
మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 11 : ప్రభుత్వ బడులలో నాణ్యమైన చదువు ఉంటుందని మండల విద్యాధికారి జమదగ్ని పేర్కోన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి, బర్సిగూడ తదితర గ్రామాల్లో బడిబాట కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంఈఓ మాట్లాడుతూ.. తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించాలని, సర్కార్ బడులలో వసతులను వివరించారు. సర్కార్ బడులలో చేర్పించాలని టీచర్లు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
‘అశుద్ధ’ జలం..! గాగిళ్లాపూర్‌లో కలుషితమవుతున్న తాగునీరు
UPI Payments | రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
BRK Bhavan | తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై ఫొటో జర్నలిస్టులను అడ్డుకున్న పోలీసులు