MLC Shambipur raju | దుండిగల్, జూన్ 3 : ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి శంభీపూర్లోని ఎమ్మెల్సీ రాజు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా తమ తమ ప్రాంతాల్లో నెలకొన్న పలు సమస్యలు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు.
కాగా పలు ప్రాంతాల్లో జరగబోయే శుభకార్యక్రమాల వేడుకల్లో పాల్గొనాలని పలువురు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ఆహ్వాన పత్రికలను అందజేశారు.
Crocodile | గద్వాలలో అర్ధరాత్రి కలకలం.. ఇండ్ల మధ్యకు వచ్చిన మొసలి
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు
Mongolia | విశ్వాసం కోల్పోయి.. మంగోలియా ప్రధాని రాజీనామా