MLA KP vivekanand | దుండిగల్, జూన్ 12 : అర్హులైన నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలనీ బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మంజూరు చేయించిన రూ.4.30 లక్షల రూపాయల విలువ చేసే మూడు ఎల్వోసీ పత్రాలను అందజేశారు.
గాజుల రామారం డివిజన్ ఇందిరానగర్ – బి ప్రాంతానికి చెందిన ఎన్ అర్జున్ (24), జీడిమెట్ల డివిజన్ వినాయక్ నగర్ కాలనీకి చెందిన చిన్నారి పలివన్ అజీజ్ (3), దుండిగల్ మున్సిపాలిటీ పరిధి దుండిగల్ వార్డుకు చెందిన తిలక్ జ్యోతి (30)ల ఆరోగ్య పరిస్థితి బాగా లేదని స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే వైద్య ఖర్చుల నిమిత్తం ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యం బాగుకై అర్హులైన నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకొని మెరుగైన వైద్యాన్ని పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో గాజుల రామారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, నదీమ్ రాయ్, ఇబ్రహీం బేగ్, అడ్వకేట్ కమలాకర్, మూసా ఖాన్, బోయిని మహేష్, సంధ్యా రెడ్డి, శ్రీదేవి రెడ్డి, యాదగిరి, జునైద్ తదితరులు పాల్గొన్నారు.
Ahmedabad plane crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ ప్రముఖుల దిగ్భ్రాంతి
Nidamanoor : భూ భారతితో భూములకు భద్రత : వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం
Surekha Vani | సురేఖా వాణి చేసిన పనికి తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్