Shambipur Krishna | దుండిగల్, జూన్ 17 : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, దుండిగల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ అన్నారు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, శంభీపూర్‌లోని ఆయన కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు, మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమతమ ప్రాంతాలలోని సమస్యలను నివేదించడంతోపాటు పరిష్కరించాలని కోరగా శంభీపూర్ కృష్ణ సానుకూలంగా స్పందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టి అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద సహాయ సహకారాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.
F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Robert Vadra | ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన రాబర్ట్ వాద్రా