MLC Kavitha | కుత్బుల్లాపూర్, జూలై 26 : తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలనేదే తెలంగాణ జాగృతి లక్ష్యమని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం కొంపల్లిలో రాష్ట్ర స్థాయి తెలంగాణ జాగృతి లీడర్ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. గత 19 ఏండ్లుగా తెలంగాణ కోసం జాగృతి పని చేస్తుందన్నారు. ఆంధ్రా సినిమాలను అడ్డుకున్న చరిత్ర తెలంగాణ జాగృతికి ఉందన్నారు.
ఉద్యమ సమయంలో తెలంగాణ యాసను కించపరిచిన క్యారెక్టర్‌కు నంది అవార్డును ప్రకటించారని, దీంతో నంది అవార్డుల ఫంక్షన్ దగ్గర నిరసన తెలిపామన్నారు. తెలంగాణ వాళ్ల డబ్బులతో సినిమాలు తీసి తెలంగాణకు వ్యతిరేకంగా పని చేశారన్నారు. ఆ సమయంలో ఆంధ్రా సినిమాలను అడ్డుకోవాలని జాగృతి పిలుపునిచ్చిందన్నారు. ఎంతటి వారికైనా ఎదురొడ్డి నిలబడిన సంస్థ తెలంగాణ జాగృతి అని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వనరులకు నష్టం జరిగితే ఊరుకునే పరిస్థితి లేదన్నారు.
తెలంగాణ వచ్చాక మూస ధోరణిలో పోలేదని, కేసీఆర్ నాయకత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం పని చేశామన్నారు. చాలా సంస్థలు పుట్టుకొస్తాయి.. పోతాయి కానీ కొన్ని మాత్రమే చరిత్రలో నిలుస్తాయని.. అదే జాగృతి అని కొనియాడారు. లీడర్ అంటే తెల్లబట్టలు వేసుకొని అద్దాలు పెట్టుకొని తిరిగే వాళ్లు కాదని, ప్రతి ఒక్కరు సంస్థాగతంగా.. ప్రజావసరాలకు అనుగుణంగా పని చేసేవాళ్లే లీడర్ గుర్తు చేశారు. లీడర్‌కు సమాజంపై కనీస స్రృహ ఉండాలని, మన ఇంట్లో ఉన్న చెత్తను పక్కింట్లో వేయకుండా ఉండడమే సామాజిక భాధ్యత అని అన్నారు. జాగృతి కార్యకర్తలు పదునైన సమాధానం ఇవ్వాలే తప్పా తిట్లు, వల్గర్ భాషకు తావివ్వద్దని.. గాంధీజీ చెప్పిన అహింస మార్గంలో జాగృతి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జాగృతి రాష్ట్ర, జిల్లాల భాద్యులు పాల్గొన్నారు.
Gajwel | గజ్వేల్‌లో దొంగల హల్చల్.. తాళం వేసిన ఇండ్లలో చోరీలు
నడిరోడ్డుపై గుంతలు.. వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం
Motkur : మోత్కూరు- రాజన్నగూడెం ప్రధాన రోడ్డుపై వరి నాట్లతో బీఆర్ఎస్ నిరసన