Laxmi Ganapathi Park | బోడుప్పల్, నవంబర్ 23 : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లక్ష్మీగణపతి కాలనీపార్కులో హరితవనం కుప్పకూలింది. సర్వే నంబర్ 215లోగల 470 చదరపు గజాల పార్కు స్థలంలో లక్షలాది రూపాయలు వెచ్చించి కొన్ని సంవత్సరాలుగా పచ్చదనాన్ని పెంచిన అధికారులే నాటిన చెట్లను నిర్ధాక్షిణ్యంగా నేలకూల్చారు.
చెట్లను రక్షించాల్సిన అధికారులే కాంట్రాక్టర్‌కు సహకరించి కాలనీపార్కులో ఉన్న చెట్లను తుదముట్టించారు. ఇంత జరిగినా ఫారెస్ట్ అధికారులు అటువైపు చూడకపోవడం గమనార్హం. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పేరుతో పచ్చదనాన్ని తొలగించి అధికారులు చేస్తున్న హడావిడి చూసిన స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
నా దృష్టికి రాలేదు : ఏ శైలజ (బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్)
బోడుప్పల్ లక్ష్మీగణపతి కాలనీలో చెట్లను తొలగించిన విషయం నా దృష్టికి రాలేదు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటా. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో చెట్లను తొలగించడం విచారకరం. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటా.
పచ్చదనాన్ని తొలగించడమేంటీ…? (లక్ష్మీగణపతి కాలనీవాసులు)
పచ్చదనాన్ని వృద్ధి చేయాల్సిన అధికారులే చెట్లను తొలగించడమేంటి…చిన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని అడ్డుపెట్టుకుని 470 చదరపు గజాల పార్కు స్థలంలో ఉన్న చెట్లను తొలగించడం హేయమైన చర్య. విచారణ జరిపి బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.


Edupayala | భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల జాతర
Guwahati Test | ముతుస్వామి సూపర్ సెంచరీ.. నాలుగు వికెట్లతో దక్షిణాఫ్రికాను కూల్చిన కుల్దీప్
Vivek Venkataswamy | నర్సాపూర్‌లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు : మంత్రి వివేక్ వెంకటస్వామి