Chaddannam | కుత్బుల్లాపూర్, జూన్ 16 : కాలం మారుతున్న క్రమంలో ఇప్పటి తరానికి పూర్వపు ఆహారపు అలవాట్లపై పూర్తిగా అవగాహన తగ్గింది. దీంతో ప్రత్యామ్నాయంగా పౌష్టికాహార లోపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకుంది. తిరిగి అప్పటి ఆహారపు అలవాట్లు నేటి ప్రజలకు పరిచయం చేసేందుకు ఓ వ్యక్తి టిఫిన్లు వద్దు… చద్దన్నమే ముద్దు అనే నినాదంతో ప్రచారాన్ని చేపట్టాడు.
పూర్తిగా రాగులు, జొన్నలు వంటి అనేక రకాలైన పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రజలకు గుర్తు చేసేందుకు చద్దన్నం మాటను తిరిగి ఇప్పటి తరానికి పరిచయం చేసేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన స్టాల్ స్థానికులను పూర్తిగా ఆలోచింప జేసింది. ప్రజలు స్టాల్ ను సందర్శించి పూర్వపు వంటలను గుర్తు చేసుకున్నారు. కాగా తక్కువ ధరలకు ప్రజలకు అందించేందుకు నిర్వాహకుడు ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులతో కిటకిటలాడింది.
Inter Results | ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫస్టియర్‌లో 67.. సెకండియర్‌లో 50శాతం పాస్
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Narsimhulapeta | ఖాజామియాకు ఆర్థిక సాయం అందజేత