Sabiha Begum | అల్లాపూర్, జులై 7: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో నాలాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని కార్పొరేటర్ సబిహా బేగం అన్నారు.
సోమవారం డివిజన్ పరిధిలోని రామారావు నగర్లో జరుగుతున్న నాలా విస్తరణ పనులను కార్పొరేటర్ సబిహా బేగం వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. గతంలో చిన్నపాటి వర్షానికే రామారావు నగర్ నాలా పొంగి ఇండ్లలోకి వరద నీరు చేరడంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళబోసేవారని గుర్తు చేశారు. ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అప్పటి మంత్రి కేటీఆర్ సహకారంతో నిధులు వేచించి నాలా విస్తరణకు శ్రీకారం చుట్టారన్నారు.
ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కార్పొరేటర్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు నాగుల సత్యం, వెంకటయ్య, ఆవుల సంజీవ, సాంబశివ, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు