MLA KP Vivekananda | కుత్బుల్లాపూర్, జూలై 26 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన ‘జేడ్ స్పెషాలిటీ హాస్పిటల్’ ను బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనుభవం గల డాక్టర్ల బృందంతో ఏర్పాటు చేసిన “జేడ్ స్పెషాలిటీ హాస్పిటల్” యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అధునాతన రోబోటిక్స్ వైద్య చికిత్స ద్వారా ఖచ్చితమైన రోగనిర్ధారణ, చికిత్స చేయవచ్చని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, విస్తరిస్తున్న నగరానికనుగుణంగా శివారు ప్రాంతాల్లోని ప్రజలకు రోబోటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతో చికిత్సను అందించేందుకు ఏర్పాటైన ‘జేడ్ స్పెషాలిటీ హాస్పిటల్’ ప్రజలందరికీ తక్కువ ధరలో మంచి వైద్యాన్ని అందించి మంచి పేరును గడించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, మాజీ కౌన్సిలర్లు చింతల దేవేందర్ యాదవ్, సువర్ణ, నాయకులు లక్ష్మణ్ గౌడ్, కృష్ణ సాగర్, ఎండీ.ఖాదర్ (షన్ను భాయ్), ఎర్రోళ్ల లక్ష్మణ్, డాక్టర్ శైలజ, డాక్టర్ శ్రీహర్ష, డాక్టర్ ప్రియదర్శిని, డాక్టర్ కౌసర్, ఇతర డాక్టర్ల బృందం తదితరులు పాల్గొన్నారు.
Gajwel | గజ్వేల్లో దొంగల హల్చల్.. తాళం వేసిన ఇండ్లలో చోరీలు
నడిరోడ్డుపై గుంతలు.. వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం
Motkur : మోత్కూరు- రాజన్నగూడెం ప్రధాన రోడ్డుపై వరి నాట్లతో బీఆర్ఎస్ నిరసన