Revenue Conferences | మేడ్చల్ కలెక్టరేట్, మే 31 : జూన్ 3వ తేది నుండి నిర్వహించే రెవెన్యూ సదస్సులకు సంబంధించి గ్రామాలలో ముందుగా ప్రజలకు సమాచారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జూన్ 3వ తేది నుండి జరుగునున్న గ్రామ రెవెన్యూ సదస్సులపై శనివారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో వచ్చే అర్జీలను, అంశాలను కేటగిరీల వారిగా పరిశీలించి వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. అర్జీలలో సర్వే నంబర్లను, భూ విస్తీర్ణం, ఏ విధంగా సంక్రమించింది అనే భూ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. అర్జీలను ముందుగా ధరణీలో ఉన్నదా లేదా అనే అంశాన్ని ముందుగా పరిశీలించి, అర్జీలకు అవసరమైన రసీదులను దరఖాస్తుదారులకు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు.
అవసరమైన మేరకు నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. ప్రతీరోజు సదస్సులో వచ్చిన దరఖాస్తులపై నివేదిక తప్పనిసరిగా అందించాలని, ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను కూడా గుర్తించి వాటిని స్వాధినం చేసుకోవాలని అన్నారు.
Fake Seeds | నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు : తొగుట సీఐ లతీఫ్
Ramayampet | లారీ – బైక్ ఢీ.. ఒకరికి తీవ్రగాయాలు
రామాయంపేటలో పాఠ్య పుస్తకాలు సిద్దం.. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అందజేత