MLA Bandari Lakshma Reddy | మల్లాపూర్, ఏప్రిల్ 26 : ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతీ డివిజన్లో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. అభివృద్ధి పనులలో భాగంగా ఎమ్మెల్యే ఇవాళ మల్లాపూర్ డివిజన్ పరిధిలో సుమారు 2 కోట్ల 66 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
రూ. 60 లక్షలతో బీటి రోడ్డు కార్పెటింగ్ బీరప్పగడ్డ నుండి మల్లాపూర్ ఇండస్ట్రీ, మనిక్ చంద్ వరకు.. రూ. 35 లక్షలతో వెంకటరమణ కాలనీలో సీసీ రోడ్డు పనులు.. రూ.30 లక్షలతో బ్రహ్మపురి కాలనీలో సీసీ రోడ్డు పనులు, రూ.45 లక్షలతో గుల్ మోహర్ గార్డెన్స్ G బ్లాక్ వద్ద బాక్స్ డ్రైన్ పెండింగ్ పనులు, రూ.45 లక్షలతో సింగం చెరువు తండా స్మశాన వాటికలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయా విభాగాల అధికారులు, స్థానిక నేతలకు నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ అధికారులు డీఈ రూప, ఏఈ స్రవంతి, వర్క్ ఇన్స్పెక్టర్లు రామారావు, భిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.
Palvancha : కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటున్న తెలంగాణ సమాజం : మాజీ మంత్రి వనమా
Amberpet | రజతోత్సవానికి రెడీ.. అంబర్పేటలో ముందే మురిసిన గులాబీ జెండా