Quality Seeds | కీసర, జూన్ 3; ప్రతీ రైతుకు క్వాలిటీ విత్తనాలను పంపిణీ చేయాలని జిల్లా వ్యవసాయాధికారి చంద్రకళ తెలిపారు. కీసరలోని రైతు వేదికలో నాణ్యమైన విత్తనం- రైతన్నకు నేస్తం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో క్వాలిటీ విత్తనాలను పంపిణీ చేశారు. ప్రతీ గ్రామంలో ముగ్గురు రైతులను ఎంపిక చేసి వారికి నాణ్యమైన మూల విత్తనం పంపిణీ చేయడం జరిగింది.
క్యూసేవ్ కార్యక్రమంలో భాగంగా MTU1010 రకం 10 కిలోల బ్యాగ్‌ను పంపిణీ చేశారు. కీసర రైతు వేదికలో రాష్ర్టస్థాయి కార్యక్రమాన్ని కీసర రైతులు వీడియో కాన్ఫరెన్స్ రైతు నేస్తం ద్వారా వీక్షించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పీజేజేఏయూ వ్యవసాయ శాస్ర్తవేత్త శివాణి, ఏడీఏ వెంకట్రాంరెడ్డి, కీసర మండల వ్యవసాయాధికారి మాధవిలత, ఏఓ కృష్ణవేణి, ఏఈఓలు వందన, రాజ్‌కుమార్, కీసర ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేణుగోపాల్‌తోపాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు.
Crocodile | గద్వాలలో అర్ధరాత్రి కలకలం.. ఇండ్ల మధ్యకు వచ్చిన మొసలి
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు
Mongolia | విశ్వాసం కోల్పోయి.. మంగోలియా ప్రధాని రాజీనామా