Municipal Workers | పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కార్మికులకు పని గంటలు తగ్గించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పాల బిందెల శ్రీనివాస్ అన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇవాళ ఆయన నిజాంపేట వార్డ్ కార్యాలయంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా రోజురోజుకు పెరుగుతున్న ఎండను దృష్టిలో పెట్టుకొని తీసుకోవలసిన జాగ్రత్తలు, వడ దెబ్బ తగలకుండా, ఆరోగ్య పరమైన సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చాలి, చాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న మున్సిపల్ సిబ్బందికి ఎండలు పెరుగుతున్న సందర్భంలో పని గంటలు తగ్గించాల్సింది పోయి అదనపు గంటలు పని చేయాలని అధికారులు చెప్పడంపై మండిపడ్డారు.
ఎండ కాలం మున్సిపల్ కార్మికులకు తరుచుగా ఉచిత వైద్య శిబిరాలు పెట్టి వైద్యం చేయాలని వారు కోరారు. అలాగే మున్సిపల్ కార్మికులు ధరించే దుస్తులు, చెప్పులు, చీపుర్లు,టోపీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ మున్సిపల్ నాయకులు దుర్గయ్య, నర్సమ్మ, భాగ్యమ్మ, యాదమ్మ, లక్ష్మి, అమృతమ్మ, సూపర్వైజర్ జీతయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Kathmandu | నేపాల్లో హింస.. 100 మంది అరెస్ట్
Chilli Farming | సస్యరక్షణ చర్యలతోనే మిర్చి అధిక దిగుబడులు: డాక్టర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డి
Heart Health | ఈ ఆహారాలను తింటే మీకు గుండె పోటు అసలు రాదు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..