MP Etela Rajender | బాలానగర్, మే 29 : ఫతేనగర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం మరో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేయాలని రైల్వే అధికారులకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. గురువారం ఆయన ఫతేనగర్ రైల్వే స్టేషన్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ రైల్వే అధికారులు ప్రజల అవసరాలను తీర్చడంలో దృష్టి సారించాలని సూచించారు. ఫతేనగర్ రైల్వే స్టేషన్లో ఫతేనగర్ వైపు మరో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలు తగ్గుముఖం పడతాయన్నారు.
రైల్వే స్టేషన్లో ఇరువైపులా టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయడం వలన ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆ దిశగా రైల్వే అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రితో చర్చించి సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులకు సూచించారు.
ఆర్ఓబి మెట్ల మార్గం ద్వారా నడుస్తూ గాయాలపాలు కావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫతేనగర్ మాజీ కార్పొరేటర్ ముద్దాపురం కృష్ణ గౌడ్, స్థానిక నాయకులు కే రాములు, గోపి, ఉదయ్, యాదగిరి, నరేష్, బాణేష్, ప్రమోద్, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, దశరథ్, సాగర్ కృష్ణ, రాజు పాల్గొన్నారు.
PM Modi | ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఆపరేషన్ సిందూర్ తగిన సమాధానం : ప్రధాని మోదీ
Sunkishala | సిటీకి సుంకిశాలే శరణ్యం.. కేసీఆర్ దిశలోనే కాంగ్రెస్ సర్కారు
Navy plane Crashes | ఘోర ప్రమాదం.. కూలిన నేవీ విమానం