Crop Change | శామీర్‌పేట, మే 26 : పంట మార్పిడితో అనేక లాభాలు ఉన్నాయని ప్రొపెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయ శాస్ర్తవేత్తలు డాక్టర్ అనురాధ, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న అన్నారు. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాలను ఆద్రాస్‌పల్లి, కేశ్వపూర్ గ్రామాల్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అవసరం మేరకే రసాయన ఎరువులు ఉపయోగించాలన్నారు. యూరియాను తక్కువగా వాడి ఖర్చును తగ్గించుకోవాలన్నారు. పంట మార్పిడి కారణంగా రైతాంగానికి ఎన్నోలాభాలని భూసారంతోపాటు చీటపీడల బెడద తగ్గుతుందన్నారు.
సాగునీటిని ఆదా చేయాలని అధికారుల సలహాలు, సూచనల మేరకు సాగు పద్దతులను పాటించి అధిక దిగుబడులు, లాభాలను గడించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో లక్ష్మణ్‌గౌడ్, కే.రోహిత, రైతు సమితి అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మాధవి, లత, బీవోఏలు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Read Also :
Nakirekal : తీవ్ర సంక్షోభంలో ప్రభుత్వ పాఠశాల విద్య : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
Godavarikhani | కాళేశ్వరం పుష్కరాల సేవలో భ్రమరాంభిక సేవకులకు ప్రశంస