దుండిగల్, ఏప్రిల్ 22: బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన జరగనున్న రజతోత్సవ భారీ బహిరంగ సభకు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు తన మూడు నెలల గౌరవ వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మంగళవారం నాడు కలిశారు. మూడు నెలల గౌరవ వేతనానికి సంబంధించిన రూ.6లక్షల విలువైన చెక్కును కేటీఆర్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా శంభీపూర్ రాజు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుడిగా, కేసీఆర్ అభిమానిగా తన వంతుగా సభ ఖర్చులకు నిధులు అందజేసినట్లు తెలిపారు.