మల్కాజిగిరి, మే 13 : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం బోయిన్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వినాయక్‌నగర్ డివిజన్‌కు చెందిన మమ్మిడి శిరీషకు రూ.51వేలు, నాగరాజుకు రూ.29వేల సీఎంఆర్ఎఫ్ పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బద్దం పరశురాంరెడ్డి, డివిజన్ మాజీ అధ్యక్షుడు తులసి సురేష్, మాజీ కార్యదర్శి బాలకృష్ణగుప్త, ఫరీద్, ఉమేష్‌కుమార్, ప్రభాకర్ రెడ్డి, సాయిసాగర్, మల్లేష్చారి, సంపత్‌యాదవ్, గోపాల్, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.