అల్వాల్ డిసెంబర్ 7 : ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ ఆధ్యర్వంలో అల్వాల్ జేఏసీ సెంటర్లో ఏర్పాటు చేసిన శాంతియుత దీక్షకు సంఘీవభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి గద్దెనెకిన తర్వాత ఒక్క హామీని నెరవేర్చడం లేదని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ప్రభుత్వ స్థలంతోపాటు ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. రెండు సంవత్సరాలు గడిచిన ఇప్పటి వరకు ఉద్యమకారుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అసెంబ్లీలో ప్రస్థావిస్తానని అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసి చర్చిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బద్దం పరశురాంరెడ్డి, ఉద్యమకారుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సురేందర్‌రెడ్డి, పుట్నాలకృష్ణ, సుధీర్, శోభన్, రాపర్తి చంద్రశేఖర్, డోలి రమేష్, శ్రీనివాసులు, కిరణ్‌కుమార్, మల్లేష్చారి, రషీష్, దయానంద్, శివకుమార్, జగన్యాదవ్, వీరస్వామి, కోండా స్వామి, మహేష్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.