MLA Marri rajashekar reddy | నేరేడ్మెట్, జూన్ 18 : మల్కాజిగిరి నియోజకవర్గంలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి జయంత్ చౌదరిని మంగళవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ మేరకు మల్కాజిగిరి నియోజకవర్గంలో నవోదయ విద్యాలయంతోపాటు వాజ్‌పేయినగర్‌లోని డిగ్రీ కళాశాలలో రుసా (రాష్ట్రీయ ఉచాతార్ శిక్ష అభియాన్) పథకాన్ని అమలు చేయాలని కోరారు.
రుసా పథకం ద్వారా వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందించేందుకు తోడ్పడుతుందని తెలిపారు. అంతేకాకుండా అత్యాధునిక మౌలిక సదుపాయాలు, వినూత్న బోధనా పధ్దతులతోపాటు మోడల్ పాఠశాలలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్న పిఎంఎస్ఆర్ఐ పథకం కింద మల్కాజిగిరిలోని అన్ని అర్హత కలిగిన పాఠశాలలను చేర్చాలని కోరారు.
అల్వాల్‌లోని ఐటీఐ కళాశాలలో మెరుగైన మౌళిక వసతులు కల్పించి సాంకేతిక విద్యను బలోపేతం చేయడానికి తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు. అందుకు మంత్రి జయంత్ చౌదరి సానుకూలంగా స్సందించారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
F-35 fighter jet | ఇంకా కేరళలోనే F-35 ఫైటర్ జెట్.. ఎందుకంటే..!
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Robert Vadra | ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన రాబర్ట్ వాద్రా