మల్కాజిగిరి, మే 20 : అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌కార్డులు అందించేలా చూడాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏఎస్ఓ సంధ్య బుధవారం ఎమ్మెల్యేను కలిశారు. ఈసందర్భంగా రేషన్‌షాపులు, కార్డుల జారీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేవిధంగా అనువైన ప్రదేశంలో కొత్త రేషన్‌షాపులు ఏర్పాటు చేయాలన్నారు.
రేషన్‌కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా పౌర సరఫరా సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జేఏసీ వెంకన్న, తోట నరేందర్‌రెడ్డి, మేకల రాము యాదవ్, అనిల్‌కిశోర్, బాల్‌రెడ్డి, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.