మల్కాజిగిరి, డిసెంబర్ 31: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం బోయిన్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వినాయక్‌నగర్ డివిజన్‌కు చెందిన పరమేశ్వరి చికిత్స కోసం రూ.50వేల సీఎంఆర్ఎఫ్ పత్రాలను కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరమన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి బద్దం పరశరాంరెడ్డి, ఫరీద్, చందు, పేపర్ శ్రీను, ఎంఆర్ శ్రీను, బంగారు మల్లేష్, కరీం, చంద్రమౌళి, శంద్రశేఖర్ గౌడ్, కృష్ణమూర్తి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.