మల్కాజిగిరి, డిసెంబర్ 31 : బీసీలకు(BCs) చెందిన జీఓ నెంబర్ 9 పై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. హక్కుల కోసం పోరాటం చేస్తున్నవారికి తనవంతు తోడ్పాటు అందిస్తామన్నారు. వడ్డెర, శాలివాహన, వాల్మీకి బోయ, నాయిబ్రాహ్మణ, గౌడ, రజక, విశ్వబ్రాహ్మణ, నాయి బ్రాహ్మణ, బట్రాజ, మేదరి, గంగపుత్ర, మేర, కల్లుగీత, తదితర కులాలకు చెందిన బీసీ ఫెడరేషన్ కులాల ప్రతినిధులు ఈ మేరకు ఎమ్మెల్యేను క్యాంప్ కార్యాలయంలో కలిసి బీసీ ఫెడరేషన్ కులాల ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రం అందజేశారు. జీఓ నెంబర్ 9 ప్రకారం కులాల స్థితిగతులను పరిశీలించాల్సిన ప్రభుత్వం, పట్టించుకోవడంలేదని తెలిపారు.
కలెక్టర్ అధ్యక్షతన మూడు నెలలకు ఒకసారి సమావేశపరిచి, కులాల స్థితిగతులను తెలుసుకోవాలని జీఓలో ఉందని తెలియజేశారు. సామాజిక వర్గాలకు న్యాయం జరిగేవిధంగా చూస్తామని ఎమ్మెల్యే హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లపు దుర్గారావు, ప్రధాన కార్యదర్శి కీర్తి యుగంధర్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీకాంత్‌చారి, మల్లేష్, నేతలు బద్దం పరుశురాంరెడ్డి, రావుల అంజయ్య, జేఏసీ వెంకన్న, గోపాల్ ముదిరాజ్, జగదీష్ చారి, శేఖర్ గౌడ్, చంద్రమౌళి, కరీం, ప్రభాకర్‌రెడ్డి, చందు, వెంకటేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.