అల్వాల్ జనవరి 2 : ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్వాల్ నూతన డిప్యూటీ కమిషనర్ భోగీశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులు ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ద్య నిర్వహణ, డ్రైనేజీ, రహదారి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పలు శాఖ అధికారులు పాల్గొన్నారు.