MLA Madhavaram Krishnarao | కేపీహెచ్బీ కాలనీ, మార్చి 30 : కూకట్పల్లిలో 400 ఏండ్ల చరిత్ర కలిగిన రామాలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఇవాళ ఆలయ ప్రాంగణంలో గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు, ఆలయ కమిటీ సభ్యులు రాజేష్ కుమార్ రెడ్డి నిర్మాణ పనుల కోసం రూ. లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూకట్పల్లిలో రామాలయంతోపాటు పురాతన చరిత్ర కలిగిన ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కృష్ణారావును ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, మాధవరం రోజాదేవి, పండల సతీష్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు పగడాల బాబురావు, మాధవరం రంగారావు, ఆలయ కమిటీ చైర్మన్ తులసిరావు, కూకట్పల్లి శివాలయం మాజీ చైర్మన్ నాయినేని సూర్యారావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
gangula | వృత్తి విద్యా కోర్సులతో బంగారు భవిష్యత్
Collector Rahul Raj | దుర్గామాతను దర్శించుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్