బీఆర్ఎస్ కార్యకర్త అక్రమ అరెస్ట్.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకే.. పోలీసుల తీరు దారుణం: ఎర్రోళ్ల శ్రీనివాస్
సోషల్ మీడియాలో వీడియో క్లిప్పులు షేర్ చేసినందుకు బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఫోన్‌చేయడంతో వదిలిపెట్టారు.
అర్వపల్లి, ఫిబ్రవరి 24/హైదరాబాద్, (నమస్తే తెలంగాణ) : సోషల్ మీడియాలో వీడియో క్లిప్పులు షేర్ చేసినందుకు బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఫోన్‌చేయడంతో వదిలిపెట్టారు. సీఎం అన్న కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసినందుకు సూర్యాపేట జిల్లా కాసర్లపహాడ్‌కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మెండే సురేశ్యాదవ్ను మంగళవారం పోలీసులు మఫ్టీలో వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
డీఎస్పీ కార్యాలయంలో కౌ న్సెలింగ్ ఇచ్చారు. అతడి ఫోన్లను లాక్కున్నారు. మందలించి వదిలేశారు. ఆ తరువా త అర్వపల్లి పోలీస్ స్టేషన్లో ఉంచారు. గతంలో సురేశ్ సోషల్ మీడియాలో అనవసర పోస్టులను షేర్ చేశాడని ఎస్సై సైదులు వివరణ ఇచ్చారు. సురేశ్యాదవ్పై పోలీసుల తీరు దారుణమని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తప్పుపట్టారు. వెంటనే విడుదల చేయాలని ఆయన ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

