అల్లాపూర్ : కూకట్పల్లి నియోజకర్గాన్ని సమస్యలు లేని నియోజకర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి నియోజకర్గంలో పరిధిలోనీ అల్లాపూర్ డివిజన్ లో రూ.8.31 కోట్లతో చేపడుతున్న అభివృధ్ది పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మంత్రికేటీఆర్ సహకారంతో నియోజకర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు.
ఒకప్పుడు త్రాగునీటి సమస్య తో అల్లాడుతున్న అల్లాపూర్ లో ఇంటింటికీ నల్లా కనేక్షన్ ఇచ్చి నిర్విరామంగా తాగునీరు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని గుర్తుచేశారు. కోట్లరూపాయలతో అల్లాపూర్ డివిజన్ ను అభివృధ్ది చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ఏడేండ్లలో అల్లాపూర్ లో గణనీయ అభివృద్ధి జరిగిందిని ,అది చూసి ఓర్వ లేక ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలో తెలియక కులాలు ,మతాల పేరుతో చిచ్చు పెట్టి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అనంతరం యూసుఫ్ నగర్ లో నిర్మాణంలో ఉన్న హిందు శ్మశాన వాటిక పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అధునాతన హంగులతో రూపుద్దికుంటున్న శ్మాశాన వాటిక లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సబిహాబేగం, టీఆర్ ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ గౌసుద్దీన్ , డివిజన్ అధ్యక్షుడు లింగాల ఐలయ్య ,పిల్లి తిరుపతి, వీరారెడ్డి, రోణంకి జగన్నాథం, జహెద్ షరీఫ్ బాబా ,ఘ్నానేశ్వర్, హమీద్, రవీందర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.