మల్లాపూర్, సెప్టెంబర్ 1 : ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లలో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మల్లాపూర్ డివిజన్ పరిధిలోని బాబానగర్‌లో రూ. 9.5, గ్రీన్‌హిల్స్‌కాలనీలో 13 లక్షల వ్యయంతో కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డితో కలిసి భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్ధాపన చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రదొ కాలనీలలో ఎలాంటి సమస్యలున్నా కార్పొరేటర్ల దృష్టికి తీసుకురావాలని కాలనీవాసులకు సూచించారు. జరుగుతున్నటు వంటి అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక నాయకులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.