MLA KP vivekananda | దుండిగల్, జులై 3 : వారాహి అమ్మవారి కృపా కటాక్షాలు భక్తుల అందరిపై ఉండాలని బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజుల రామారం డివిజన్ షిరిడి హిల్స్‌లో వారాహి అనుగ్రహ పీఠం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన శ్రీ వారాహి అమ్మవారి ఆషాడ గుప్త నవరాత్రుల వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఎమ్మెల్యే ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ.. మహిమాన్విత అమ్మవారైన వారాహి అమ్మవారి కృపా కటాక్షలతో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, ఇబ్రహీం ఖాన్, మూసా ఖాన్, తెలంగాణ సాయి, సుంకరి చందు, చిన్నా చౌదరి, కరుణాకర్ రాజు, ప్రసాద్, మహేష్, శివా నాయక్, జునైద్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.
SI Rajeshwar | బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు.. రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ మృతి
Fake medicines | ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ మందుల దందా.. పట్టించుకోని అధికారులు
DEO Radha Kishan | కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో రాధా కిషన్