కాప్రా, నవంబరు 2 : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదివారం పరామర్శించారు. హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణరావు ఇటీవల మృతి చెందడంతో నగరంలోని వారి నివాసానికి వెళ్లి ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి తదితరులతో కలిసి సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మాజీమంత్రి హరీష్‌రావును, వారి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టసమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.