మల్లాపూర్, అక్టోబర్ 23 : ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లలో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. అభివృద్ధి పనులలో బాగంగా ఆయన గురువారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని సూర్యనగర్ కాలనీ, బ్యాంక్‌కాలనీ ప్రధాన రహదారులలో రూ. 60 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పనులకు కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డితో కలిసి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని డివిజన్లలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఎక్కడైన పెండింగ్ పనులు ఉన్నట్లయితే తన ధృష్టికి తీసుకురావాలని కాలనీవాసులకు సూచించారు. అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సదరు కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈ రూప. ఏఈ స్రవంతి, వర్క్ ఇన్స్పెక్టర్ రామారావు, సూర్యనగర్, బ్యాంక్‌కాలనీ అధ్యక్షులు యాదగిరిగౌడ్, రవియాదవ్, పద్మారెడ్డి, అంజయ్య, ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు బోదాసు లక్ష్మీనారాయణ, చిగుళ్ల శ్రీనివాస్, తండా వాసుగౌడ్, తీగుళ్ల శ్రీనివాస్‌గౌడ్, దయాకర్‌రెడ్డి, అల్లాడి కృష్ణయాదవ్, పీరూనాయక్, జబ్బార్, వెంకటాచారి, తదితరులు పాల్గొన్నారు.