మల్లాపూర్,అక్టోబర్ 8 : మోస పూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హామీల పేరుతో బాకీ పడ్డ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మల్లాపూర్ శివ హోటల్ చౌరస్తా నుంచి ఇంటింటికి తిరుగుతు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంత బాకీ ఉందో బాకీ కార్డులను అందజేసి వివరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు రైతు బంధు మొదలుకొని మహిళలకు, యువతులకు, వృద్ధులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. రాబోయే స్థానిక సంస్థల, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.