Cherlapally Division | చర్లపల్లి, జూలై 2 : చర్లపల్లి డివిజన్ సమగ్రాభివృద్ధికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నేమూరి మహేశ్‌గౌడ్ పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ సోనియ గాంధీ నగర్లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అదేశాల మేరకు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దాసరి కనకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాలనీలోని సూచికబోర్డులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తగు చర్యలు తీసుకుంటున్నారని, సోనియాగాంధీనగర్ అభివృద్ధిలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ఇప్పటికే కాలనీలో పలు అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీ కార్యదర్శి శేనగరం శివకుమార్, ఉపాధ్యాక్షుడు నరేశ్ నేత, గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్, మాజీ అధ్యక్షుడు సంపత్, మహేందర్, శ్రీనివాస్, సూర్యనారాయణ, ఉపేందర్, వెంకట్‌గౌడ్, మురళిలతో పాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
SIGACHI | మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం.. సిగాచీ పరిశ్రమ ప్రకటన
Phoenix Movie | ఈ సినిమాకు ముందు 120 కిలోలున్నా : విజయ్ సేతుపతి కుమారుడు సూర్య