మల్లాపూర్, అక్టోబర్ 21 : పేద, మధ్య తరగతి కుటుంబాలు నివసించే బస్తీలలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మంగళవారం మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్ పరిధిలోని ఇందిరనగర్ బస్తీ దవాఖానను స్థానిక కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ జి. శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి సందర్శించి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు సరైన వైద్యం అందించాలని దవాఖాన డాక్టర్లకు, సిబ్బందికి సూచించారు.
ఆరు నెలలుగా వేతనాలు రావడం లేదని వారు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం దవాఖానలో తనిఖీ చేసి గడువు ముగిసిన మందులను గుర్తించారు. రోగులకు సరైన మందులను అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని డాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ డివిజన్ అధ్యక్షుడు వంజరి ప్రవీణ్ కరిపే, సాయి, నిసార్ ఆహ్మద్ గోరి, శేఖర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.