మేడ్చల్ జోన్ బృందం, జూలై 12: ఖబడ్దార్ రేవంత్ రెడ్డి… రైతాంగం జోలికి వస్తే సహించబోం, తరిమితరిమి కొడుతామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించాయి. వ్యవసాయానికి 3గంటల కరెంట్ చాలు అని టీపీసీసీ అధ్య క్షడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పలు చోట్ల రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.మేడ్చల్‌లో జరిగిన నిరసనలో మంత్రి చామకూర మల్లారెడ్డి, మెదక్ ఎంపీ కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి లేకుంటే నీళ్లు, కరెంట్ ఉండకపోయేది, పండించిన గిట్టుబాటు ధర కూడా దక్కేది కాదన్నారు. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఖబడ్దార్ రేవంత్ రెడ్డి. ..రైతు గురించి మాట్లాడితే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. గతంలో వచ్చిన ఆరుసీట్లు కూడా ఈ సారి కాంగ్రెస్‌కు రావని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దయాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేయర్లు, చైర్పర్సన్లు కావ్య, ప్రణీతాశ్రీకాంత్ గౌడ్, లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, దీపికానర్సింహారెడ్డి, కొండల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.