keesara gutta | కీసర, జూన్ 15 : కీసరగుట్టలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్టు ఆధారాలు లభించాయి. ఈ విషయపై కొంతమంది స్థానికులు ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయం వెనుకభాగంలోని లింగాలకుంటలో గుర్తు తెలియని దుండగులు వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ఆనవాళ్లు కన్పించాయి.
స్వామివారి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న లింగానికి పూజలు చేసి గుప్త నిధుల కోసం కొన్ని అడుగుల మేరకు అట్టి స్థలంలో పూజలు చేసి తవ్వకాలు జరిపారు. ఈ సంఘటన స్థలంలో ఓ మట్టికుండ, ఎర్రని గుడ్డ, పసుపు, నీళ్ల బాటిల్ కన్పించడటం పలు అనుమానాలకు తావిస్తుంది. సాక్షాత్తు శ్రీ రామచంద్రుడు పూజలు జరిపి ప్రతిష్టించాడని శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయానికి పురాతన కాలం నుంచి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
కీసరగుట్టలో గుప్త నిధుల కోసం గతంలో ఇంతకుముందు కూడా తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఈ విషయం మీద ఉన్నతాధికారులు ప్రత్యేక చొరువ తీసుకొని అక్రమంగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన దుండగులను గుర్తించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కీసర ప్రజలతోపాటు పలువురు భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Sim Card | మీ పేరుతో ఎవరైనా సిమ్‌కార్డు తీసుకున్నారా..? ఎలా తెలుసుకోవాలంటే..?
RFCL | కోలుకుంటున్న ఆర్ఎఫ్సీఎల్ బాధితుడు.. అప్రమత్తతతోనే తప్పిన అగ్ని ప్రమాదం
Free medical camp | దయానంద విద్యా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం