కుత్బుల్లాపూర్, జూన్ 12 : స్కూల్ బస్సుల పై మేడ్చల్ ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. వేసవి సెలవుల అనంతరం గురువారం పునః ప్రారంభం కావడంతో స్కూల్ బస్సుల పై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నాలుగు స్కూల్ బస్సులను సీజ్ చేశారు.
బస్సులు ఫిట్నెస్ లేనివి కావడంతోపాటు ఫైర్ ఎగ్జిట్, డ్రైవర్ నైపుణ్యత ఇతర నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులను ఎట్టి పరిస్థితుల్లో రోడ్డుపై అనుమతించేది లేదని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. ఆయా స్కూళ్ల యాజమాన్యాలు రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా బస్సులో విద్యార్థులను ఎక్కించుకుని వెళితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.