Curret Shock | బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వచ్చిన గోపీ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టడంతో విగత జీవిగా మారిపోయాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. కూలీ పని చేస్తున్న గోపీ (34) దుండిగల్ పీఎస్ పరిధిలోని గండి మైసమ్మ నుండి నర్సాపూర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన కరెంట్ కేబుల్, డ్రైనేజ్ పైప్లైన్ కోసం గుంత తవ్వుతుండగా ప్రమాదవశాత్తు భూమిలోని కేబుల్ వైర్ అతనికి తగిలి షాక్ కొట్టింది. దీంతో గోపీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు
మృతుడిని మహబూబాబాద్ మల్యాల గ్రామానికి చెందిన గోపీగా గుర్తించారు. దుండిగల్ మున్సిపాలిటీ అధికారులు మరమ్మతు పనులు చేపట్టే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
BRS | కేసీఆర్పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
Lakshmi Devipalli | బావోజి తండాలో తాగు నీటి సమస్యను పరిష్కరించండి
Karepalli | ఆదర్శంగా నిలుస్తున్న కారేపల్లి క్రాస్ రోడ్ యువత.. ఆపద సమయంలో అండగా నిలుస్తున్న యువకులు