MLA Krishna Rao | కేపీహెచ్‌బీ కాలనీ : విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాదారం కృష్ణారావు పిలుపునిచ్చారు. బుధవారం కూకట్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జామ్ కిట్స్‌ను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ విద్యార్థులకు చేతనందించేందుకు సొంత ఖర్చులతో ప్రతి ఏటా.. స్కూల్ బ్యాగ్‌లు, నోట్ బుక్స్, పెన్నులు పెన్సిల్స్‌తో కూడిన కిట్టును అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు వసతులను సద్వినియోగం చేసుకొవాలని, క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్‌ను అందించిన ఫెడరేషన్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీ నేతలు శ్యామలరాజు, సుధీర్, రామకృష్ణంరాజు, సంతోష్, ప్రభాకర్, ఉపాధ్యాయులు ఉన్నారు.