chicken | బోడుప్పల్, జూలై 19: మాంస ప్రియులు స్టన్నింగ్ చేసి వధించిన చికెన్ మాత్రమే వాడాలని కేంద్రీయ మాంస పరిశోధన కేంద్రం (ఎన్ఎమ్ఆర్ఐ చెంగిచెర్ల) డాక్టర్ సి రామకృష్ణ సూచించారు. శనివారం ”నమస్తే తెలంగాణ”తో ఆయన మాట్లాడుతూ..మాంస ప్రియులు ఇష్టంగా స్వీకరించే చికెన్ స్టన్నింగ్ (అపస్మారక స్థితికి తీసుకెళ్లి వధించడం) చేసిన దాన్ని మాత్రమే తీసుకోవాలని, ఇది అన్ని రకాలుగా ఆరోగ్యానికి ఆయన మంచిదని వెల్లడించారు. స్టన్నింగ్ చేయకుండా కోళ్లను హింసించి చంపడం చట్టరీత్యా నేరమని, అలా చేస్తే జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించబడుతుందని ఆయన తెలిపారు.
స్టన్నింగ్ ప్రక్రియ ద్వారానే కోళ్లను వధించాలి..
కోళ్లను అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి వధించడం (స్టన్నింగ్) ద్వారా కోళ్లకు ఎటువంటి బాధ, నొప్పి, పెనుగులాట లేకుండా మత్తులో ప్రాణాలు వదులుతాయని, అలాంటి మాంసం మాత్రమే వాడాలని, ఆరోగ్యానికి మంచిదని అనేక పరిశోధనలో వెల్లడైందని ఆయన తెలిపారు.
నిరుద్యోగులకు శిక్షణ..
నిరుద్యోగ యువతీ యువకులకు, చికెన్ సెంటర్ యజమానులకు, నిర్వాహకులకు, సిబ్బందికి స్టన్నింగ్ ప్రక్రియపై ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయని, ఔత్సాహీకులు 924728 5278 ఫోన్లో సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని డాక్టర్ రామకృష్ణ సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి (ఎన్ఎమ్ఆర్ఐ)కేంద్ర ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్ జారీ చేయబడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
Yadagirigutta : యాదగిరిగుట్టలో రూ.5 వేలతో గరుఢ టికెట్ !
అప్రెంటీస్ విధానంలో టీజీఎస్ఆర్టీసీలో దరఖాస్తుల ఆహ్వానం
Online scams | ఆన్ లైన్ మోసాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. షీ టీం సీనియర్ సభ్యురాలు స్నేహలత