Keesara | కీసర, మార్చి 1 : కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. గత నెల ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. కీసరగుట్టలోని యాగశాలలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల చివరి రోజు కావడంతో గర్భాలయంలో శ్రీ మూలవిరాట్స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించుకున్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులను తీర్చుకున్నారు.
జాతర ముగింపు వేడుకల్లో భాగంగా వేదపండితులు అంతా కలిసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ, ఆలయ ఈఓ కట్టా సుధాకర్‌రెడ్డి, ఆలయ ధర్మకర్తలు నల్లా మధుసుధన్‌రెడ్డి, కౌకుట్ల కృష్ణారెడ్డి, పోశబోయిన రాజుయాదవ్, రెడ్డబోయిన ప్రవీన్‌కుమార్, మొరుగు ముత్యాలు, దుర్గాప్రసాద్‌గౌడ్, అమరేందర్, కందాడి అంజిరెడ్డి, సగ్గు అనిత, రాపోలు శంకరయ్య, జూపల్లి సాయులు, పాముకుంట్ల ప్రభాకర్, వంశపారంపర్య ధర్మకర్తలు రమేశ్‌శర్మ, టి. వెంకటేశ్, నాగలింగంశర్మలతో పాటు కీసరగుట్ట వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.