సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ దోహదం చేస్తుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో ఆదివారం హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో పెద్ద ఆరోగ్య సమస్యగా ఉన్న సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందన్నారు.
- సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 8: సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ దోహదం చేస్తుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్పష్టం చేశారు. సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో ఆదివారం హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో పెద్ద ఆరోగ్య సమస్యగా ఉన్న సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందన్నారు.
జిల్లాలోని 15 ఏండ్లలోపు బాలికలకు జనరల్ దవాఖాన, ఏరియా దవాఖానల్లో హెచ్పీవీ వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 14 నుంచి 15 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న దాదాపు 12,500 మంది బాలికలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు. ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆయా బాలికలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయనున్నట్లు వివరించారు. క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వసంతరావు, వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

