MLA KP Vivekanand | మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
MLA KP Vivekanand | ఇవాళ 132 జీడిమెట్ల డివిజన్ వెన్నెల గడ్డలోని ఎఫ్సీఎస్ కన్వెన్షన్లో నిర్వహించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, జీడిమెట్ల శాఖ 5వ సర్వసభ్య సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
MLA KP Vivekanand | కుత్బుల్లాపూర్, మే 25 : మత్స్య సహకార సంఘం అభివృద్ధికి తన వంతు కృషి నిరంతరం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హామీ ఇచ్చారు. ఇవాళ 132 జీడిమెట్ల డివిజన్ వెన్నెల గడ్డలోని ఎఫ్సీఎస్ కన్వెన్షన్లో నిర్వహించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, జీడిమెట్ల శాఖ 5వ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో చెరువులకు జీవం పోస్తూ మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆర్థికాభివృద్ధిని అందించి, మత్స్య పారిశ్రామిక అభివృద్ధికి కృషిచేసిన గొప్ప నాయకుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. జీడిమెట్ల డివిజన్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఫిషరీస్ కో- ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ సుకీర్తి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జీడిమెట్ల శాఖ అధ్యక్షుడు చిలుకూరి కృష్ణ, ఉపాధ్యక్షురాలు చిలుకూరి యాదమ్మ, ప్రధాన కార్యదర్శి మద్దూరి వీరేష్, డైరెక్టర్లు తాళ్ల వెంకటేష్, మన్నెశంకర్, అరికల లక్ష్మణ్, మద్దూరి సత్తెమ్మ, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Visa Fraud | ఉద్యోగాలు సృష్టిస్తున్నట్లు ఫేక్ డాక్యుమెంట్స్.. అక్రమంగా వీసాల విక్రయం.. ఇద్దరు పాకిస్థానీలు అరెస్ట్
Narala Tirupati Reddy | సభ్యుల పరస్పర సహకారంతో ఆర్థికాభివృద్ధి : పురుషుల పొదుపు సమితి అధ్యక్షులు నరాల తిరుపతిరెడ్డి
Harish Rao | గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం : హరీశ్రావు
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

