Telangana Formation Day | బోడుప్పల్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి. పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి అమరవీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంద సంజీవరెడ్డి మాట్లాడుతూ… అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మలిదశ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టి గమ్యాన్ని ముద్దాడిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చరిత్ర సువర్ణ లిఖితం అన్నారు. గడిచిన దశాబ్ధకాలంగా తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Medak | ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: టీజీసీపీఎస్ ఈయూ నేత నర్సింహులు
Textbooks | పాపన్నపేట మండలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈవో ప్రతాప్ రెడ్డి