Jupally Satyanarayana | కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 17 : బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే మహాసభను విజయవంతం చేయాలని కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ కోరారు. ఇవాళ డివిజన్లోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జూపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. మరోవైపు నగరంలో కరెంట్ కష్టాలు పెరిగాయని.. తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
కాలనీలు, బస్తీల్లో అభివృద్ధి పనులు జరుగడం లేదన్నారు. నేటి కాంగ్రెస్ పాలన దుస్థితిని ప్రజలకు వివరించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 27న వరంగల్లో నిర్వహించే బహిరంగ సభకు భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు భీమని సంతోష్, ఏ లక్ష్మీనారాయణ, కార్యదర్శి చేకూరి ప్రభాకర్, నేతలు నాయినేని అభిలాష్ రావు, బొట్టు విష్ణు, మేకల నర్సింగ్ రావు, స్వప్న రెడ్డి, లీల, రాజేశ్వరి, పలువురు మహిళా నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Minister Ponguleti | భూ వివాదాలు లేని రాష్ట్రంగా భూ భారతి చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Amit Shah: సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే.. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే: అమిత్ షా
Illegally Sand | అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ అనిత