Bandari Lakshma Reddy | ఉప్పల్, మార్చి 18 : ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. హబ్సిగూడ డివిజన్ పరిధిలోని స్ట్రీట్ నంబర్ 1లో 28 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఇవాళ కార్పోరేటర్ చేతన హరీష్‌తో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పసుల ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ బివి చారి, జైనవీన్, సోమిరెడ్డి, లింగా నాయక్, రవి నాయక్, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Danam Nagender | సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్
Amitabh Bachchan: షారూక్, విజయ్ను దాటేసిన బిగ్ బీ.. 120 కోట్ల ట్యాక్స్ కట్టిన అమితాబ్ బచ్చన్