ముంబై : బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అత్యధిక పన్ను చెల్లిస్తున్న సెలబ్రిటీగా చరిత్రకెక్కాడు. 2024-2025 సంవత్సరానికి బిగ్ బీ అమితాబ్.. సుమారు 120 కోట్ల ఆదాయ పన్ను చెల్లించారు. పన్ను చెల్లింపుల్లో ఆయన షారూక్ ఖాన్, విజయ్‌లను దాటేశారు. గత ఏడాది షారూక్ ఖాన్ 92 కోట్ల ట్యాక్స్ చెల్లించారు. అయితే ఇప్పుడు ఆ రికార్డును బాలీవుడ్ నటుడు అమితాబ్ చెరిపేశారు. 82 ఏళ్ల ఆ స్టార్ నటుడు 2024-25 సంవత్సరానికి 120 కోట్ల పన్ను కట్టారు.
కల్కీ 2898 ఏడీ, వెట్టియాన్ చిత్రాల్లో అమితాబ్ నటనపై ప్రశంసలు కురిశాయి. బ్రాండ్ ఎండోర్స్మెంట్లతోనూ బిగ్ బీ ఆర్జన రెట్టింపు అయ్యింది. కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 16 ద్వారా కూడా ఆయన ఆదాయం పెరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వార కూడా అమితాబ్ తన ఆదాయాన్ని పెంచుకున్నది. చిత్రాలు, టాప్ బ్రాండ్లకు ప్రమోటర్‌గా అమితాబ్ అత్యధిక స్థాయిలో ఆర్జిస్తున్నారు. అయితే 2024-25 సంవత్సరానికి ఆయన సుమారు 350 కోట్లు ఆర్జించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల్లో అత్యధికంగా ఆర్జిస్తున్న ఆర్టిస్టుగా అమితాబ్ నిలిచారు.
పన్ను చెల్లింపుల్లో దేశ ప్రజలకు అమితాబ్ రోల్‌మోడల్‌గా ఉంటాడని ఓ వ్యక్తి తెలిపారు. సెక్షన్ 84, కల్కి 2898 ఏడీ సీక్వెల్లో కూడా అమితాబ్ నటిస్తున్నాడు.