MLA Bandari Lakshma reddy | కాప్రా, జూలై 6 : కాప్రా డివిజన్ ఎల్లారెడ్డిగూడ కృష్ణానగర్ కాలనీ సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం కృష్ణానగర్ కాలనీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికైన నూతన హౌజింగ్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గం ఉప్పల్ ఎమ్మెల్యేను సైనిక్‌పురిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త కార్యవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించారు.
ఈ సందర్భంగా కాలనీలో డ్రైనేజీ సమస్యలు తీర్చాలని ఎమ్మెల్యేను కృష్ణానగర్ హౌజింగ్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కాలనీ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు యుగంధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి విక్రమ్‌కుమార్, జైకుమార్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Sigachi Industries | సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనలో 41కి చేరిన మృతులు.. ఇంకా దొరకని 9 మంది ఆచూకీ
Dalai Lama | ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు