MLA Bandari Lakshma Reddy | ఉప్పల్, జూన్ 15 : సీనియర్ సిటిజన్ల సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్స్ సమావేశం నాచారంలోని హెచ్ఎంటీ నగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కోదండ రామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్లకు సమాజంలో తగిన గౌరవం, గుర్తింపు తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, ఎల్లారెడ్డి, సీనియర్ నాయకులు సాయి జెన్ శేఖర్, సాయిబాబా, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Sim Card | మీ పేరుతో ఎవరైనా సిమ్‌కార్డు తీసుకున్నారా..? ఎలా తెలుసుకోవాలంటే..?
RFCL | కోలుకుంటున్న ఆర్ఎఫ్సీఎల్ బాధితుడు.. అప్రమత్తతతోనే తప్పిన అగ్ని ప్రమాదం
Free medical camp | దయానంద విద్యా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం